Trinethram News : తిరుమల : చంద్ర గ్రహణం నేపథ్యంలో మార్చి 3వ తేదిన ఉదయం 9 గంటలకు తిరుమల లోని శ్రీవారి ఆలయంను మూసివేయనున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు.
ఆ రోజు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు గ్రహణం ఉంటుందని చెప్పారు. మొత్తం 10.30 గంటలపాటు ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు. అదే రోజు కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయని, వాటికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


