జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 05 at 4.21.20 PM 1

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం..

తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ కుటుంబం దర్శించుకున్నారు. భార్య ఊహా, కుమారుడు రోషన్‌, మరో కుమారుడు రోహన్, కూతురు మేధతో కలిసి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని చెప్పారు. స్వామి ఆశీస్సులు, అనుగ్రహం పొందామన్నారు. తాను నటిస్తున్న దేవర, గేమ్ చేంజర్ సినిమాలు ప్రస్తుతానికి సెట్‌లో ఉన్నాయని తెలిపారు. రెండింటిలోనూ మంచి క్యారెక్టర్లు చేయడం చాలా సంతోషంగా ఉందని శ్రీకాంత్ పేర్కొన్నారు.

శ్రీకాంత్ కుమారుడు రోషన్ మాట్లాడుతూ ప్రస్తుతానికి వైజయంతి పతాకంపై ‘ఛాంపియన్’ అనే సినిమా చేస్తున్నట్టు తెలిపారు. తాను చేస్తున్న మరికొన్ని సినిమా విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు.

You cannot copy content of this page