జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 05 at 5.52.50 PM

TRINETHRAM NEWS

Trinethram News : సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండి సజ్జనార్

హైదరాబాద్ జనవరి 05
సంక్రాంతి పండుగకు సొంతూళ్ల‌కు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త ప్రకటించింది. ప్ర‌త్యేకంగా 4,484బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.

జనవరి 6 నుంచి 15 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉండ‌ను న్నాయి.హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర లకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు.

ప్రత్యేక సర్వీసుల్లో మహి ళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పా రు.చార్జీ పెంపు లేకుండానే ప్రత్యేక బస్సులు ఏర్పాలు చేసినట్టు ఎండీ స‌జ్జ‌నార్ చెప్పారు.

ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగనీయమ న్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్‌బీ నగర్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ తదితర రద్దీ ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రయాణి కులకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలిపారు.

బస్‌భవన్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ల నుంచి రద్దీ ప్రాంతాల్లోని పరిస్థితులను ఎప్పటిక ప్పుడు పరిశీలిస్తుంటామని అన్నారు.

ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునేం దుకు వీలుగా టోల్‌ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

అధిక చార్జీలు చెల్లించి ప్రజలు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించనక్కర్లేదని, ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవా లని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సూచించారు.

You cannot copy content of this page