త్రినేత్రం న్యూస్ పెనుమూరు. శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పాలమిత్రలకు మిక్సీలను పంపిణీ చేసినట్లు శ్రీజ డైరీ ఏరియా ఆఫీసర్ మునికృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెనుమూరు పరిధిలో 42 మంది పాల మిత్రలకు దీపావళి కానుకగా మిక్సీలు పంపిణీ చేశామన్నారు. స్వచ్ఛమైన నాణ్యమైన పాల సేకరణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించారు. శ్రీజ పి.బి.ఐ అధికారి మురళి మాట్లాడుతూ జైక సంస్థ సపోర్టుతో శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గ్రామస్థాయిలో మహిళా పాల ఉత్పత్తిదారులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. వెటర్నరి అసిస్టెంట్ లక్ష్మీనరసింహ మాట్లాడుతూ పశువులకు వాతావరణ మార్పులు వల్ల వచ్చే వ్యాధులకు ముందస్తు చికిత్సలు గూర్చి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ తాయారమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మగేష్ మరియు పాలమిత్రలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


