కన్నులపండుగగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కల్యాణం

TRINETHRAM NEWS

అనపర్తి :త్రినేత్రంన్యూస్ : అనపర్తి నల్లకాలువ వంతెన వద్ద కొలువై వున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కల్యాణ మహోత్సవం గురువారం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణ కర్తలుగా కొవ్వూరి నర్శిరెడ్డి మణిమాల దంపతులు, వారి కుమారులు, కోడళ్ళు ప్రదీప్ కుమార్ రెడ్డి, సుధారాణి, సందీప్ కుమార్ రెడ్డి,సూర్య ప్రవజరెడ్డి మనవళ్లు అద్విక్ రెడ్డిలు వ్యవహరించారు. కళ్యాణ బ్రహ్మలుగా శ్రీనివాస్,రఘు, సురేష్ లు వేడుకలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, ట్రావెలింగ్ బాయ్స్ ఆద్వర్యంలో జరిగిన స్వామి వారి కళ్యాణ వేడుకలు తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sridevi and Bhudevi's Divine

You cannot copy content of this page

Scroll to Top