Sri Prasannanjaneya Swamy : శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ సంకల్పం

TRINETHRAM NEWS
Sri Prasannanjaneya Swamy Temple Reconstruction Plan

Sri Prasannanjaneya Swamy : దేవరకొండ డివిజన్ మార్చ్ 28, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండలం టీ గౌరారం కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి కాలనీ ప్రజలు, పెద్దలు శ్రీకారం చుట్టారు.

శనివారం నిర్వహించిన గ్రామ సమావేశంలో ఆలయ నిర్మాణ వ్యయం, నిధుల సేకరణపై సుదీర్ఘంగా చర్చించారు.గ్రామంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణం కోసం రూ. 3,000 విరాళంగా ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ విరాళాలను ఏప్రిల్ 1 నుండి జూన్ 1వ తేదీ లోపు అందజేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పేర్ల కళ్యాణి లింగమయ్య మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించడం అభినందనీయమని, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఉపసర్పంచ్ పిల్లి లక్ష్మమ్మ మాట్లాడుతూ భక్తులు, గ్రామ పెద్దలు భక్తిశ్రద్ధలతో ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిల్లి బాలయ్య, వార్డు సభ్యులు ఆంజనేయులు, పిల్లి వెంకటయ్య, విలేఖరి పేర్ల మహేష్, గ్రామ పెద్దలు నల్లగాసు సత్తయ్య, వరికుప్పల వెంకటేశులు, బద్దె శంకర్, యువకులు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top