తేదీ : 27/10/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలో ఉన్న గన్నవరం నియోజకవర్గంలో కార్తీక మాసం సందర్భంగా గన్నవరం,కేసరపల్లి, సావారిగూడెం, చిక్కవరం, ముస్తాబాద్.,సురంపల్లి, అజ్జంపూడి, విరపనేనిగూడెం, తే౦పల్లి, నిడమానూరు, నున్న., రామవరప్పాడు, మానికొండ, ఇందుపల్లి., తెలప్రోలు.ఉంగటూరు,ఎలుకపడు.వెల్దoపాడు.బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో స్వయంభూ గా వెలిసిన శ్రీ గంగాపార్వతీ సమేత కొండేశ్వరస్వామి దేవస్థానం భక్తులు శివనామస్మరణలతో మారుమోగింది .
వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున్న తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించడం జరిగింది. అర్చకులు కుందుర్తి మురళీశర్మ ఆధ్వర్యంలో స్వామి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం , క్షీరాభిషేకం పంచామృతాభిషేకాలతో స్వామి వారి ప్రత్యేక పూజ నిర్వహించారు. వీరవల్లి తో పాటు చుట్టుప్రక్కల గ్రామాలు నుంచి పెద్ద ఎత్తున్న తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.కార్తీక మాసం పరమశివునికి అరాధిస్తే సర్వసంపదలను సమస్త శుభాలను చేకూరతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


