TRINETHRAM NEWS

ఆర్థోపెడిక్ విభాగానికి ప్రత్యేక అభినందనలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*జిల్లా ఆస్పత్రిలో గణనీయంగా పెరిగిన ఆర్థో సర్జరీలు

పెద్దపల్లి, నవంబర్ -02: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థో సర్జరీలు గణనీయంగా పెరిగాయని, దీనికి కృషి చేసిన ఆర్థోపెడిక్ విభాగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ హర్ష  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో ఇంతకు ముందు నెలకు సరాసరి 4 ఆర్థో సర్జరీ లు జరగగా, ఈ కేసులు గణనీయంగా పెరుగుతూ వచ్చి, ఆగస్ట్ నెలలో 29, సెప్టెంబర్ నెల లో 40, అక్టోబర్ నెల లో 51 సర్జరీలు జరగాయని కలెక్టర్ తెలిపారు.

మన పెద్దపల్లి ఆసుపత్రిలో సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు డా. కుమార్, డా .శ్రీనివాస్ రెడ్డి, అందుబాటులో వున్నారని,ఎలాంటి క్లిష్టమైన ఆర్థో సర్జరీ ని సమర్థవంతంగా నిర్వహించడానికి సరిపడా నైపుణ్యం, అనుభవం ఆర్థో వైద్యులకు ఉందని అన్నారు.

మన జిల్లా ఆస్పత్రిలో క్లిష్టమైన హై రిస్క్ కేసులను హ్యాండిల్ చేయగల మత్తు వైద్య నిపుణులు అందుబాటులో వున్నారని, కాళ్ళు వంకరగా పుట్టిన నవజాత శిశువు లకు సంబదించిన పొంశెట్టి క్యాస్టింగ్ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో జరుగుతుందని, ఇప్పటి వరకు 6 గురు నవజాత శిశువు లకు చికిత్స అందిచడం జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా ఇందుకు కృషి చేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ ను, ఆర్థో వైద్యులను,అనస్థీషియా వైద్యులను ,సంబంధించిన బృందం మొత్తాన్ని కలెక్టర్ అభినందించారు.

ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆర్థో విభాగానికి సంబందించి సేవలను ప్రజలు అందరూ వినియోగించుకోగలరని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App