Free Training : ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

TRINETHRAM NEWS

ఉద్యోగాలు సాధించి దేశ భద్రత, ప్రజా రక్షణలో భాగస్వాములు కావాలి గోదావరిఖని ఏసీపీ రమేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని కేర్ క్లబ్ లో అగ్ని వీర్ ఆర్మీ రిక్యూమెంట్‌ ఫిజికల్, రాత పరీక్షకు సన్నదం అయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ లో భాగంగా ఈరోజు స్టడీ మెటీరియల్ ను ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి చేతుల మీదుగా అందచేశారు
ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ అగ్నివీర్‌ ద్వారా ఇండియన్‌ ఆర్మీ వింగ్‌లోకి రిక్రూట్‌మెంట్‌ కోసం జిల్లాలో అర్హత, ఆసక్తి గల అభ్యర్థులకు రాత పరీక్ష, దేహదారుడ్య శిక్షణను అందించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్టేడియంలో రిటైర్డ్‌ ఆర్మీ జవాన్ల పర్యవేక్షణలో రన్నింగ్‌, మెడికల్‌, ఇతర ఫిజికల్‌ టెస్టులు అర్హత సాధించడానికి అన్ని రకాల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిదంగా రాత పరీక్షల కోసం శిక్షణ ఇస్తామన్నారు దీన్ని సద్వినియోగం చేసుకోని ఉద్యోగ సాధనకై పట్టుదలతో నిరంతర శ్రమతో కష్టపడి అందరు ఉద్యోగాలు సాధించి దేశ భద్రత, ప్రజా రక్షణలో భాగస్వాములు కావాలని, తమ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని, ఉద్యోగాలు సాదించాలనే తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో గోదావరిఖని ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి, ఇంచార్జి మహిపాల్‌రెడ్డి, టీచింగ్ ఫాకల్టీ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Army should take advantage

You cannot copy content of this page

Scroll to Top