జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 29 at 3.52.16 PM

TRINETHRAM NEWS

విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి – ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ అధ్వర్యంలో పట్టణ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ బీరకాయల వివేక్ మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల విద్యార్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. బస్సులు సమయానికి రాక కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా సమయాన్ని మించి ప్రయాణం చేస్తున్నారని దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కళాశాల నుండి తిరిగి ఇంటికి వెళ్లడానికి దాదాపు రాత్రి 9 గంటల సమయం పడుతుంది దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళాశాల విద్యార్థులకు ఉదయం సాయంత్రం ప్రత్యక్ష బస్సులు కేటాయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది లేనియెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పవన్, జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చరణ్, టెక్నికల్ కన్వీనర్ సాకేత్,నగర సంయుక్త కార్యదర్శి హరీశ్, పర్షరాం,అభిరామ్ తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page