త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం గుట్టు కింద పల్లి హరిజనవాడలో మంగళవారం మన ఊరికి మన థామస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మమ్మల్ని గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని కృత నిక్షయంతో ఉంది అన్నారు. తర్వాత ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
మండలంలో ఎక్కువగా రెవెన్యూ సమస్యల పై ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని ఎమ్మార్వో ఎంపీడీవోలు సమన్వయంతో వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే సామిరెడ్డిపల్లి రోడ్డు విషయంలో పోలీసుల తీరును ఆయన తప్పు పట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రుద్రయ్య నాయుడు, పెనుమూరు మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు, తలారి రెడ్డప్ప, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ, గుర్రప్ప నాయుడు హరిబాబు నాయుడు సతీష్ రెడ్డి బాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


