తేదీ : 09/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సొంగ. రోషన్ కుమార్ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పలు వార్డులకు చెందిన ప్రజలు ఆయనను కలిశారు. వారి సమస్యలను ఆర్జీల రూపంలో రాసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


