జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 07 at 9.26.29 PM

TRINETHRAM NEWS

Trinethram News : తేదీ :07-01-2024

దీర్ఘకాలిక వ్యాధులతో అనారోగ్య సమస్యలతో భాద పడుతున్న కుటుంబానికి సోషల్ రెస్పాన్సిబులిటీ టీం చేయూత..

జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలం లోని మాన్ దొడ్డి గ్రామానికి చెందిన కళావతి (25) గారికి గత కొన్ని సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధులు కిడ్నీ, గైనకాలజీ, థైరాయిడ్,రక్తనాళల, రక్త సరఫరా, చర్మ వ్యాధులు, బాడీ పెయిన్స్ వంటి సమస్యలతో నరక యాతన అనుభవిస్తూ ఉన్నది.
తండ్రి రాముడు చెక్కెర, బీపీ, అక్క లక్ష్మి (వికలాంగురాలు ) కుటుంబ పోషణ మరియు సరైన వైద్యం చేయించుకోలేక ఇబ్బదులు పడుతున్నారు.
కర్నూల్ నగరంలోని మెడికేర్ హాస్పిటల్ ఆరోగ్య చికిత్స పొందుతున్న కళావతి గారిని సోషల్ రెస్పాన్సిబులిటీ టీమ్ సభ్యులు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 36 వేల రూపాయలు ఆర్థిక సహాయo అందించారు.

ఈకార్యక్రమంలో టీం సభ్యులు సంధ్య అశోక్, శివ ప్రసాద్,అయ్యన్న, రాము, బెంజిమెన్,సలీమ్, షకీల్,వినోద్, కొండలయ్య తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page