
Social Boycott : శ్రీకాకుళం జిల్లా : మార్చి 23 : (త్రినేత్రం న్యూస్); జిల్లా రంగస్థలంలో చర్చనీయమైన ఘటన చోటు చేసుకుంది. ఓ కుటుంబం సామాజిక బహిష్కరణకు గురైంది. భూమి రికార్డులు రెవిన్యూ శాఖలో తారుమారు చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఆ గ్రామస్తులు, పెద్దలు కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సదరు కుటుంబంతో ఎవరూ మాట్లాడకూడదని, ఏ పనులకు పిలవకూడదని , ఎటువంటి శుభ అశుభ కార్యాలకు ఆహ్వానించవద్దని దండోరా వేయించారు. తాము చెప్పిన మాటలు పె డచెవిన పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

