Bomb Threats : కోర్టుకు బాంబు బెదిరింపులు

TRINETHRAM NEWS
Bomb threats to the court

Bomb Threats : కృష్ణాజిల్లా : మార్చి 23: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అయితే ఆ కోర్టులో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు జిల్లా జడ్జికి ఈమెయిల్ పంపారు. దీంతో న్యాయమూర్తి తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు.

ఆ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. ఎవరని లోపలకి అనుమతించకుండా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. బాంబు స్కాడ్ సహాయంతో అక్కడి పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top