TRINETHRAM NEWS

Trinethram News : తమిళనాడు :

గంధపు చెక్కలు, ఏనుగు దంతాల,స్మగ్లర్ వీరప్పన్ ను ఎన్ కౌంటర్ చేసి చాలా ఏళ్లు గడుస్తున్నా ఆయనను ఎవరూ మర్చిపోలేదు. ఆయన జీవిత చరిత్రపై పలు సినిమాలు కూడా వచ్చాయి.

తాజాగా ఆయన కూతురు విద్యారాణి వీరప్పన్ ఎన్నికల బరిలోకి దిగారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఆమె కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.

ఆమెకు సినీ దర్శకుడు, నామ్ తమిళర్ కట్చి పార్టీ కన్వీనర్ సీమాన్ కృష్ణగిరి టికెట్ కేటాయించారు. విద్యారాణి నాలుగేళ్ల క్రితం బీజేపీలో చేరారు. నాలుగేళ్లుగా ఆమె పార్టీలో ఉన్నా… బీజేపీ నాయకత్వం ఆమెకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో చాలా కాలంగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఆమె బీజేపీకి రాజీనామా చేసి నామ్ తమిళర్ కట్చి పార్టీలో చేరారు. రానున్న ఎన్నికల్లో నామ్ తమిళర్ కట్చి పార్టీ తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలతో పాటు పుదుచ్చేరి స్థానంలో కూడా పోటీ చేస్తోంది.