జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 30 at 7.05.46 PM

TRINETHRAM NEWS

వరంగల్ జిల్లాలో ఆరుగురు చిన్నారులకు కోవిడ్.

వరంగల్ డిసెంబర్ 30:వరంగల్‌ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. వరంగల్‌ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కరోనా నిర్ధారణ అయ్యింది.

దీంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు ఆయా చిన్నారులకు ప్రత్యేక వార్డులో చికిత్స అంద జేస్తున్నారు.

నగరానికి చెందిన ఆరుగురు చిన్నారులకు కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి దీంతో కాకతీయ మెడికల్‌ కాలేజీ లోని వైరాలజీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా చిన్నారులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం.

ఇటీవల నీలోఫర్‌ ఆసు పత్రిలో ముగ్గురు చిన్నారులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే అయితే కరోనా మహమ్మారి మళ్లీ కలవ రానికి గురి చేస్తున్నది.

ఇటీవల రాష్ట్రంలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇందులో చిన్నారులు సైతం ఉండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవు తున్నాయి.

You cannot copy content of this page