PLR (Diwali) Bonus : సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు లాభాల వాటా, పి ఎల్ ఆర్(దీపావళి)బోనస్ చెల్లించాలి

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గురువారం నాడు పోచారం మున్సిపాలిటీ చౌదరి గూడ ఓ. యూ కాలనీ లో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ సింగరేణిలో పని చేస్తున్న ఉద్యోగులకు గత నెల 29 వ తేదీన 2024-2025 ఆర్థిక సంవత్సరం లో సంస్థ లాభాల వాటాలో 34శాతం చెల్లించడం వలన కార్మికులు ఉత్సాహంగా దసరా పండుగ జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం దీపావళి పండుగకు చెల్లించే ఈ సంవత్సరపు పి ఎల్ ఆర్ బోనస్ రూ.1,03,000 ఈ నెల 17 న చెల్లిస్తామని యాజమాన్యం పత్రిక ప్రకటన ద్వారా తెలిపింది. కానీ ఆర్థిక సంవత్సర లాభాల వాటా, దీపావళి బోనస్ కూడా పని చేసే ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు ఒకే తేదీన చెల్లింపులు గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుట లేదు.

రిటైర్డ్ ఉద్యోగులకు సంస్థ చెల్లించిన ప్రావిడెంట్ ఫండ్,గ్రాట్యుటీ సొమ్ము ఇంటి నిర్మాణాలు,కుటుంబ సభ్యుల వివాహాలకు ఖర్చు చేయబడింది.30,40 సంవత్సరాలు సంస్థ అభివృద్ధికి పాటు పడి గత ఆర్థిక సంవత్సరం లో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు లభించే లాభాల వాటా, దీపావళి బోనస్ కొరకు నిరీక్షించడం బాధాకరమైన విషయం.సాంకేతికంగా అగ్రగామిగా ఉండి క్షణాల్లో గణాంక వివరాలు తెలిపే వ్యవస్థ ఉన్నప్పటికి చెల్లింపులో జాప్యం ఎందుకో అని రిటైర్డ్ ఉద్యోగులు వాపోతున్నారు. కనుక పని చేసే ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులకు కూడా ఈ నెల 17 న దీపావళి బోనస్ తో పాటు పెండింగ్ లో ఉన్న లాభాల వాటా చెల్లించి రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలలో దీపకాంతులు వెదజల్లాలని,సింగరేణి విశ్రాంత ఉద్యోగులు యాజమాన్యాన్ని వేడుకుంటున్నారని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ తెలిపారు. ఈ సమావేశంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు కంచ బీరయ్య,గీస కనకయ్య, పొగాకు రవీందర్, ఎం.డి.రఫీక్ అహమద్,కె.జి రాజు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Singareni retired employees should be paid profit

You cannot copy content of this page

Scroll to Top