Gaddam Vamsi : గడ్డం వంశీ కి అభినందనలు తెలిపిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు నెలకు అతి తక్కువగా వెయ్యి రూపాయల లోపు పెన్షన్ పొందుతున్నారని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ వాపోయారు., మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి వెంకట స్వామి కృషి వలన ఏర్పడిన కోల్ మైన్స్ పెన్షన్ స్కీం ప్రవేశ పెట్టి 27 సంవత్సరాలు గడిచినను వారి పెన్షన్ లో పెరుగుదల లేదని, పెన్షనర్ల నేటి ప్రాథమిక అవసరాలు తీర్చేందుకు సింగరేణి పెన్షనర్లకు నెలకు కనీస పెన్షన్ రూ.10,000 చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అభినందనీయమని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Singareni retired employees congratulate Gaddam Vamsi

You cannot copy content of this page

Scroll to Top