17 మందిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
విధుల నిర్లక్ష్యం పట్ల చర్యలు, ఉత్తర్వులు జారీ
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి పంచాయతీ ఎన్నికల విధుల అధికారులకు గట్టి షాక్ తగిలింది. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ 17 మందిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
దాల్తాబాద్ మండలానికి చెందిన గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులుగా నియమించడం జరిగింది. వీరు విధుల్లో బాధ్యతారహితంగా నిర్లక్ష్యం వహించి విధులకు గైర్హాజరు అయ్యారు. దీంతో జిల్లా కలెక్టర్ వీరిని విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. వంగరి అఖిల్, తన్వీర్ ఫాతిమా, రాజశేఖర్, నాటికరూ నీలప్ప, తలారి పద్మమ్మ, కే .మౌనిక, విజయలక్ష్మి, కాల్ కొండి గోపి సాయి, పానుగంటి శారద, ఎండి ఆయుబ్ పాష , సిందే శ్రీనివాస రమేష్, ఎక్కేల్లి భీమయ్య, సబీహ సుల్తానా, ఇస్రా జాబిన్ లను ఎన్నికల విదు లకు గైరహజరు అయినందున వీరిని విధుల నుండి సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారి చేసారు.
అంతకుముందు బుధవారం బషీరాబాద్ మండల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కుల్కచర్ల మండలానికి చెందిన పటేల్ చెరువు తండా ఎస్జిటి మానస, నీటూరు ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ నసీం రెహనా లు అదేవిధంగా పెద్దేముల్ మండల్ ఎంపీపీఎస్ కు చెందిన స్కూల్ అసిస్టెంట్ అన్నపూర్ణ లకు గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అధికారులుగా నియమించడం జరిగింది. వీరు విధుల్లో బాధ్యతారహితంగా నిర్లక్ష్యం వహించి విధులకు గైర్హాజరు అయినందున జిల్లా కలెక్టర్ వీరిని విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


