
Shining Star : అరకులోయ, జూలై 21,(త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం అరకువేలి శారద నికేతన్ పాఠశాల విద్యార్థిని దొర మౌనిక ప్రతిభకు గుర్తింపుగా జిల్లా స్థాయి ‘షైనింగ్ స్టార్‘ అవార్డు అందుకుంది. 2025–26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 600 మార్కులకు 571 మార్కులు సాధించి అరకువేలి మండలంలో ప్రథమ స్థానం దక్కించుకున్న మౌనికను జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం పాడేరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ), రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) చేతుల మీదుగా మౌనికకు ‘షైనింగ్ స్టార్’ అవార్డు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా శారద నికేతన్ పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. చిరంజీవి, శారద ట్రస్ట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మౌనికను అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. చిరంజీవి, విద్యార్థిని తల్లిదండ్రులు ధర్మదాస్ తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో అవార్డు అందుకోవడం పాఠశాలకు గర్వకారణమని పలువురు అభిప్రాయపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe