జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 27 at 14.35.29

TRINETHRAM NEWS

Seyam Revanth Reddy’s Singareni alias Bhaditul post card movement

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి మారుపేర్ల బాదితుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పోస్టు కార్డులను తపాలా పెట్టెలో వేయడం జరిగింది. స్థానిక గోదావరిఖని పట్టణంలోని సూర్యనగర్ ప్రదాన తపాలా కార్యాలయం వద్ద సింగరేణి మారుపేర్ల తో ఇబ్బందులను‌ ఎదుర్కొంటున్న కార్మిక వారసుల సమస్యలను పరిష్కరించాలని పోస్టు కార్డుల ద్వారా సీయం రేవంత్ రెడ్డికి విన్నవించడం జరిగింది.

ఈ సందర్భంగా గోలివాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర మాట్లాడుతూ ” సింగరేణి సంస్థలో కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేసి, సంస్థ అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషించి, రిటైర్ అయిన కార్మికులు, వారిపై ఆధారపడ్డ వారి కుటుంబ సభ్యులు, వారి వారసులు మారు పేర్ల వలన ఉద్యోగాలు రాక, పెన్షన్లకు నోచుకోక, వైద్య సదుపాయాలు అందక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, భూపాలపల్లి బొగ్గు బావుల మీద సభలో సీయం రేవంత్ రెడ్డి ప్రస్తుత మంత్రుల సమక్షంలో, కార్మిక నాయకుల సమక్షంలో, కార్మికుల సమక్షంలో మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో వన్ టైమ్ సెటిల్మెంట్ క్రింద పరిష్కరిస్తామని హామీ‌ ఇవ్వడం జరిగిందని.
ఈ మారు పేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీయం రేవంత్ రెడ్డి ని కోరుతూ పోస్టు కార్డులు పంపడం జరిగిందని” అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ నాయకులు చెన్నూరి నాగరాజు, మొలుగూరి మహేష్, నాగుల శివకుమార్, సుందిళ్ల సూర్య, కుమ్మరి నాగార్జున, సింగరేణి మారుపేర్ల బాదితులు లక్క శ్రావణ్, పాతపల్లి హరీష్, దొమ్మేటి రాజు, బొమ్మక కార్తీక్, వేగోళపు సునీల్, పొన్నం వెంకటేష్, పల్లె సంతోష్, బొమ్మక రాజయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page