Trinethram News : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరనే ఫిర్యాదులే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రం అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9, 10వ తరగతులు కొనసాగడం లేదు. మొత్తంగా ఆరో తరగతిలో 2, ఏడులో ఒకరు, ఎనిమిదో తరగతిలో ఇద్దరు విద్యార్థులున్నారు. వీరిలోనూ రోజూ ఇద్దరు లేదా ముగ్గురే హాజరవుతున్నారు. 2022-23లో ఇక్కడ 18 మంది ఉండేవారు. గతేడాది నలుగురు పదో తరగతి పూర్తి చేశారు. ఈసారి పదో తరగతికి రావాల్సిన ఒక్కరు కూడా సమీపంలోని కోరపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రవేశం పొందాడు. మిగతా వారూ ఇతర పాఠశాలలకు వెళ్లిపోయారు. తక్కువ మంది విద్యార్థులు ఉండటంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని నిర్వాహకుడు ఇంటి వద్దే తయారు చేసి తెస్తున్నారు. అయితే ఇద్దరు ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయినా.. అక్కడి ఉపాధ్యాయులు రిలీవ్ కాకపోవటంతో ఇక్కడే కొనసాగుతున్నారు. ఇదే ఆవరణలోని ప్రాథమిక పాఠశాలలో మాత్రం 30 మంది విద్యార్థులు ఉండటం విశేషం. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తామని ప్రధానోపాధ్యాయురాలు హేమలత తెలిపారు.
అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు
Related Posts
Cricket Tournament : క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన శ్రీను బాబు
TRINETHRAM NEWS క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన శ్రీను బాబు రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగిరి మండలంలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో రామగిరి మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభావతి…
Kabaddi Court : కబడ్డీ కోర్టులో ఆ వ్యక్తి దహన సంస్కారాలు
TRINETHRAM NEWS కబడ్డీ కోర్టులో ఆ వ్యక్తి దహన సంస్కారాలు. Trinethram News : Telangana : కబడ్డీ అంటే అతనికి ఎంతో ఇష్టం. కబడ్డీ నేర్చుకొని ఎంతోమందికి దాన్ని నేర్పించిన వ్యక్తి. అతని వల్ల ఎంతోమంది కబడ్డీ క్రీడాకారులు అయ్యారు..…