విగ్రహాలకో చౌక్ ( స్టాట్యూచౌక్ ) పెట్టండి

TRINETHRAM NEWS

భారతదేశంలోని ముఖ్యమంత్రులారా..!!

రవీంద్రభారతిలో ఎన్ని విగ్రహాలకు స్థలం ఉంది.

-రవీంద్రభారతిలో ఇంకా ఎన్ని విగ్రహాలకు స్ధలంఉంటుంది.

-కనీసం ప్రతి విగ్రహానికి 10 నుంచి 15 అడుగుల విస్తీర్ణం కావాలి.

-ఇలా విగ్రహాలను నింపుకుంటూ పోతే… భవిష్యత్తులో అమరుల జయంతులు వర్ధంతులకే రవీంద్ర భారతి పరిమితమయ్యే అవకాశం ఉంది.

కూకట్పల్లి డిసెంబర్ 05 (త్రినేత్రం న్యూస్): భారత ప్రజలందరి తరపున మీకు నమస్కారాలు ప్రజల పెరుగుదలతో పాటు పురస్కార గ్రహీతలు ప్రవీణులు, సాహితీవేత్తలు, రాజనీతిజ్ఞులు ఇలా ప్రజాప్రాచుర్యం పొందిన మహానుభావుల సంఖ్య దినదినం పెరుగుతూనే ఉంటుంది. కాస్త పలుకుబడి తోడైతే చాలు నగరం నడిబొడ్డులో విగ్రహాలు నిలబెట్టుకోవటానికి పెద్దగా ఆటంకాలు ఉండట్లేదు. విగ్రహాలు ఎవరు పెడుతున్నారు, ఎవరివి పెడుతున్నారనే దానికన్నా ఎక్కడ పెడుతున్నారు అనేది కూడా పర్మిషన్ ఇచ్చే స్థానంలో ఉన్న అధికారులు, పాలకులు విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్క హైదరాబాద్ నగరాన్ని పరిశీలిస్తే రోజు రోజుకి వలసలు పెరిగి గంట గంటకు జనసాంద్రత పెరుగుతున్న రాష్ట్ర రాజధాని ప్రాంతం ఇది. నగరంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అధికారిక అనధికారిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రవీంద్ర భారతి ఓ ప్రధాన వేదికగా ఉంది.

జనాభా పెరిగినంత తేలికగా రవీంద్ర భారతి లాంటి సాంస్కృతిక వేదికల వైశాల్యం పెరగదు కదా. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రాచుర్యం పొందిన నటులు కళాకారులు రాజకీయ నాయకులు వివిధ రంగాల్లోని నిష్ట్ణాతులు గణనీయమే అయినా కుల,మత, ప్రాంత ప్రభావిత పరిస్థితుల్లో ఎవరిని విస్మరించలేని సంకట స్థితిలో పాలకులు కొట్టుమిట్టాడుతారన్నది నగ్నసత్యం. ఒక ఉద్దేశం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఆ స్థలమంతా వివిధ రంగాలలో ఘనత సాధించిన ప్రముఖుల విగ్రహాలతో నిండిపోతే భవిష్యత్తులో ఏ ఉద్దేశంతో రవీంద్ర భారతి, హరిహర కళాభవన్, త్యాగరాయ గానసభ లాంటి సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామో వాటి ఉద్దేశం నెరవేరదేమో అని సందేహం. పాలకులు తమ తాత్కాలిక ప్రయోజనాల కోసం విగ్రహాలు నెలకొల్పగానే సరిపోదు కదా ఇది మొదలుకొని ఆ విగ్రహాల దగ్గర వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించకుండా నియంత్రించగలరా…?

ఆ విగ్రహ మూర్తి పలుకుబడో.. ఆయా కాలానికి తగ్గ ప్రాధాన్యతలో వివాదాలకు కేంద్రబిందువు కాకపోరాదు. ఒకే రోజు ఇద్దరు ముగ్గురు విగ్రహమూర్తుల కార్యక్రమాలు ఒకే పరిమిత ప్రదేశంలో నిర్వహించుకోవలసి వచ్చినప్పుడు, ఆ ప్రధాన వేదికలో మరొక పోటీ కార్యక్రమమో, వైరిపక్షాలకు సంబంధించిన కార్యక్రమము కార్యక్రమము ఉంటే ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొనే సందర్భాలు లేవని చెప్పలేం. అంతేకాకుండా వేదిక బయట ఒక కార్యక్రమం లోపల ఒక కార్యక్రమం నిర్వహించాల్సిన సందర్భాలు కూడా భవిష్యత్తులో కుల మత వర్గ వైశ్యామ్యాలను వివాదాలను పెంచి ఉద్రిక్త పరిస్థితులను పెంపొందించే పెను ప్రమాదాలు ముందు ముందు రాబోను ఉన్నాయని గ్రహించి రవీంద్ర భారతి లాంటి సాంస్కృతిక కేంద్రాల వద్ద ప్రముఖుల విగ్రహాలకు పర్మిషన్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ…వీలుంటే ఉన్న విగ్రహాలన్నిటిని ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక విగ్రహాల చౌక్ ఏర్పాటుచేసినట్లైతే.. భవిష్య త్తులో సాంస్కృతిక సామరస్య వాతావరణానికి దోహదపడగలదని మనవి.

–కొండూరు కోటిబాబు
హైకోర్టు అడ్వకేట్,ఎంసీజే,ఎస్ పిటియు, హైదరాబాద్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Set up a chowk for statues

You cannot copy content of this page

Scroll to Top