
జూబ్లీహిల్స్‌లో ఓ వినియోగదారుడికి రూ.20 వేల జరిమానా
జలమండలి తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చేపట్టిన చర్యలను మరింత ముమ్మరం చేసింది.
Strict Action : త్రినేత్రం న్యూస్ : జూబ్లీహిల్స్ రోడ్ నెం.23లోని 8-2-293/82/A/350 చిరునామాలో పూర్ణిమ (CAN No. 061108905) అనే వినియోగదారు తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్‌కు వినియోగిస్తూ దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. దీంతో సంబంధిత వినియోగదారుకు రూ.20,000 జరిమానా విధించి వసూలు చేశారు.
తాగునీరు అత్యంత విలువైన వనరు కావడంతో ప్రజలు దానిని బాధ్యతాయుతంగా వినియోగించాలని, వృథా చేయవద్దని జలమండలి విజ్ఞప్తి చేసింది. తాగునీటిని ఇతర అవసరాలకు దుర్వినియోగం చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
తాగునీటి దుర్వినియోగం మీ దృష్టికి వస్తే, సంబంధిత వివరాలను జలమండలి వాట్సాప్ నంబర్: +91 99499 30003కు పంపించాలని ప్రజలకు సూచించింది…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe