త్రినేత్రం న్యూస్ : చేవెళ్ల నియోజకవర్గం: నవాబ్ పేట్ మండలం ఎమ్మెల్యే స్వగ్రామం చించల్ పేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన భవనాలను పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క , రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మరియు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య .ముందుగా మంత్రులకు గ్రామస్తులు బతుకమ్మ, బోనాలు, గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు.
గ్రామంలో నూతనంగా నిర్మించిన భవనాలు 15 లక్షలతో అంగన్ వాడీ భవనం, 20 లక్షలతో బీసీ కమ్యూనిటీ భవనం, 20 లక్షల నిధులతో పశు వైద్యశాల ఉప కేంద్రం, 20లక్షల డ్వాక్రా భవనం, 20 లక్షల నిధులతో ఎస్సీ కమ్యూనిటీ భవనం, ప్రాథమిక వైద్య ఉప కేంద్రం, నిధులతో గ్రామపంచాయతీ భవనాలను నిర్మించిన వాటిని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ , జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


