కేతావత్ బాబురామ్ నాయక్, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షులు.
దేవరకొండ జులై 14 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర దేవరకొండ నియోజకవర్గంలోని గిరిజన బాలికల ఆశ్రమ హాస్టల్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఆహార విషబాధ (ఫుడ్ పాయిజన్) ఘటన గిరిజన సమాజాన్ని తీవ్ర కల్లోలానికి గురిచేసింది. దాదాపు 20 మంది బాలికలు అస్వస్థతకు గురవ్వడం, వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు తక్షణ స్పందన చూపించకపోవడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠగా నిలిచింది.
ఈ ఘటన కేవలం ఆహార విషబాధకే పరిమితంకాకుండా, హాస్టల్‌లో నెలకొన్న అసహనకర పరిస్థితులన్నిటినీ బహిర్గతం చేసింది. పిల్లలు స్వయంగా వెల్లడించిన విషయాల ప్రకారం: హాస్టల్ బాత్రూములు వారానికి ఒకసారి మాత్రమే శుభ్రపరచడం – ఇది అనారోగ్య పరిస్థితులకు దారితీసే అత్యంత నిర్లక్ష్యపు పాలనకు నిదర్శనం. మరింత దారుణమైన విషయం ఏమంటే, బాలికల బాత్రూములను శుభ్రపరచేందుకు జెంట్స్ వర్కర్ ను నియమించడం. ఇది నైతికంగా, భద్రతాపరంగా తీవ్రంగా తప్పు.
ఆ వర్కర్ పిల్లల అభిప్రాయాలను పట్టించుకోకుండా, “కర్రీ బాగా లేదంటూ” అన్నప్పుడు భయపెట్టడం, అణచివేయడం వంటి మానసిక వేధింపులకు పాల్పడడం వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌లో సిబ్బంది తక్కువగా ఉండటం, నైట్ వాచ్‌మెన్ లేకపోవడం వల్ల రాత్రి భద్రత లేకుండా పోవడం బాలికల భద్రతను ప్రమాదంలో నెట్టుతోంది.
ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ — ప్రజాప్రతినిధులు, ఏటిడిఓలు, డిటిడబ్ల్యూ అధికారులు ఇప్పటివరకు ఒక్కసారైనా హాస్టల్‌కు వెళ్లి పిల్లల పరిస్థితిని తెలుసుకోకపోవడం గిరిజన సమాజానికి తీవ్ర అన్యాయం. “హెల్త్ ప్రాబ్లమ్” అనే వాదనలతో పదవుల్ని భద్రంగా ఉంచుకుంటూ బాధ్యతల్ని వదిలేసుకోవడం తల్లిదండ్రుల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
బాలికల హాస్టల్‌లో జెంట్స్ వర్కర్ల నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలి. మహిళా వర్కర్లను ప్రత్యేకంగా నియమించి ప్రతిరోజూ పరిశుభ్రతను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. పిల్లలను భయపెట్టే లేదా వేధించే సిబ్బందిని వెంటనే విధులనుడి తొలగించాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


