Schools and Inter : పాఠశాలలు మరియు ఇంటర్ ,డిగ్రీ కళాశాల వివరణలు

TRINETHRAM NEWS

తేదీ : 17/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , చింతలపూడి నియోజకవర్గంలో ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు , కళాశాల ప్రిన్సిపాల్ లు సంబంధిత వివరాలను తెలపడం జరిగింది. లింగపాలెం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ఆరు వందల మార్కులకు గాను ఓదూరి. నికిత ఐదు వందల వందల యాభై ఒకటి స్థానాన్ని సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, బి. గురు వర్షిత ఐదు వందల ఇరవై నాలుగు మార్కులు సాధించి ద్వితీయ స్థానాన్ని స్వాధీనం చేసుకుంది. అలాగే ఐదు వందల ఇరవై మూడు మార్కులతో గంగా. భవాని తృతీయ స్థానాన్ని కలిగింది. ఈ పాఠశాలలో రెండు వందల ముప్ఫై మంది విద్యార్థులు గలరని ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు తరగతులు ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు బి. శ్రీధర్, అన్నారు.

ధర్మాజీగూడెం ప్రైవేట్ పాఠశాల అనన్య విద్యాసంస్థల్లో డి. కౌశిక్ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్పులతో ఫస్ట్ క్లాస్ సాధించగా,టీ. జా శ్విత రెడ్డి ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులతో సెకండ్ క్లాస్ రాగా ,సీ. హెచ్. రమ్యశ్రీ కి ఐదు వందల డెబ్భై ఐదు మార్కులు థర్డ్ క్లాస్ సాధించింది. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రాంబాబు కరస్పెండెంట్ & కార్యదర్శి అన్నారు. క్రిస్టియన్ పాఠశాలలో . సొంగా. దీపిక ఐదు వందల అరవై మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని చేరింది. కోడూరు. శిరి ఐదు వందల యాభై ఐదు మార్కులతో ద్వితీయ స్థానంలో ఉంది. కె. సిటీ ఐదు వందల నలభై ఆరు మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచింది. ఈ పాఠశాలలో కేజీ మరియు పదవ తరగతి వరకు కలదు. మరొక పాఠశాలలో పి. రోహిత ఐదు వందల ఎనభై మార్కులతో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంది. ఆ కరెస్పాండెంట్ ప్రధానోపాధ్యాయులు సి హేచ్. విజయలక్ష్మి తెలిపారు.
శ్రీ సాయి జూనియర్ కళాశాల యాజమాన్యం , ప్రిన్సిపల్ జి. రత్న మాట్లాడుతూ బైపిసి, ఎంపీసీ, సిఇసి గ్రూపులకు సంబంధించి వివరాలు తెలిపారు. మొన్న రాసినటువంటి పబ్లిక్ పరీక్షల్లో ఎంపీసీ గ్రూపులో నాలుగు వందల డెబ్బై గాను వి. జాహ్నవి నాలుగు వందల యాభై ఏడు సాధించి ప్రథమ స్థానాన్ని గెలుపొందింది. బైపీసీలో నాలుగు వందల నలభై కు గాను పరస. కీర్తి మూడు వందలు తొంబై తొమ్మిది మార్కులతో ఫస్ట్ క్లాస్ వచ్చింది. సీఈసీ గ్రూపులో మూడు వందల తొంబై ఆరు మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని గెలిచింది. అదేవిధంగా సీనియర్ విభాగంలో మార్కు లు కు ఎ. సునీత తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మార్కులు, ఎంపీసీ లో సాధించింది.
బైపీసీలో తొమ్మిది వందల అరవై ఐదు మార్కులు యం. భార్గవి సాధించింది. సీఈ సి లో యు. లీలా స్వర్ణ మాధురి తొమ్మిది వందల ఎనిమిది మార్కులతో ప్రభంజనం సృష్టించారు అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్. డాక్టర్. పి. శ్రీనివాసరావు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Schools and Inter, Degree

You cannot copy content of this page

Scroll to Top