జూలై 16, 2026

WhatsApp Image 2024 02 06 at 8.18.25 PM

TRINETHRAM NEWS

తిరుపతి జిల్లా:

రాష్ట్రంలోని సర్పంచులు ఎంపీటీసీలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలి వెళ్లిన చిత్తూరు జిల్లాకు చెందిన ఎంపీటీసీలు సర్పంచ్లను మంగళవారం మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. స్టేషన్ ముందు రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్బరామయ్య, సర్పంచులు ఎంపీటీసీలు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే దాకా తమ పోరాటం ఆగదని మరింత ఉధృతం చేస్తామని సుబ్బరామయ్య హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన కోసం వచ్చిన తమని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణం అన్నారు. అరెస్ట్ అయిన వారిలో కిరణ్ యాదవ్ మునిష్ శ్రీనివాసన్ సురేష్ వెంకటకృష్ణ మనీ చంద్ర లు ఉన్నారు.

You cannot copy content of this page