తిరుమలకుంట పంచాయతీలో కొత్త శకం.. అట్టహాసంగా సర్పంచ్, ఉపసర్పంచ్ ప్రమాణ స్వీకారం
తిరుమలకుంట పంచాయతీలో ఘనంగా నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం
త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామ, పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నేడు అత్యంత వైభవంగా, జనసందోహం మధ్య ఘనంగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
అధికారికంగా బాధ్యతల స్వీకారం:
నిర్ణయించిన శుభ ముహూర్తానికి ఉదయం 10:09 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ) కటకాల కార్తీక్ నూతన పాలకవర్గం చే ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్ గా కోర్సా రాజేష్ (B.Sc, B.Ed) , ఉప సర్పంచ్ గా పానుగంటి నాగ సత్య శ్రీనివాసరావు మరియు వార్డు సభ్యులు దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గ సభ్యులు:
- సర్పంచ్: కోర్సా రాజేష్
- ఉపసర్పంచ్: పానుగంటి నాగ సత్య శ్రీనివాసరావు
- వార్డు సభ్యులు:
- పొట్ట నాగేంద్ర (1 వ వార్డు)
- మచ్చ జగదాంబ (2 వ వార్డు)
- పూణెం రమణ (3 వ వార్డు)
- పానుగంటి వేణు బాబు (5 వ వార్డు)
- చిప్పల రమణ (6 వ వార్డు)
- కుర్సాం వెంకటేష్ (7 వ వార్డు)
*మడకం ఈశ్వరమ్మ (8 వ వార్డు) - పొట్ట రామకృష్ణ (9 వ వార్డు)
- డాబా ముత్యాలు (10 వ వార్డు)
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు, గ్రామ శాఖ అధ్యక్షులు ,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచా కాల్చి, “జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్” నినాదాలతో హోరెత్తించారు. గ్రామ అభివృద్ధి, ధ్యేయంగా, ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, పాలన అందిస్తామని ఈ సందర్భంగా నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


