దేవరకొండ డివిజన్ నవంబర్ 22 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ మరియు మేరా యువభారత్ వారి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినారు. స్థానిక జడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ వద్ద ముఖ్య అతిథులు ఆర్ డీ ఓ రమణారెడ్డి , సీ ఐ వెంక రెడ్డి , అధ్యక్షులు ఎన్ వీ టీ , జి రాజేష్ మేరా భారత్ డిస్టిక్ ఆఫీసర్ సభ్యులు మరియు విద్యార్థులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు. అనంతరం వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఒక భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, మరియు భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రి.
స్వాతంత్ర్యం తర్వాత, ఆయన 500కు పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు, అందుకే ఆయనను “భారతదేశపు ఉక్కు మనిషి” అని పిలుస్తారు. ఆయన గుజరాత్‌లో జన్మించారు, ఇంగ్లాండ్‌లో బారిష్టర్ పట్టా పొందారు, మరియు గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు అని అన్నారు. విద్యార్థులు యువత మహనీయులను మరవరాదని వారి ఆశయ సాధనకై ఎప్పుడు ముందుండాలని ఈ సందర్భంగా వారు. జాతీయ సమైక్యత దేశభక్తిని పెంపొందించడం ప్రత్యేకంచి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిది అని అన్నారు. తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో నక్క వెంకటేష్ ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డీ ఆర్ మద్దిలేటి సుధాకర్ ఎం కె నాయక్ వి నరేందర్ రెడ్డి లీగల్ అడ్వైజర్ ఉమామహేష్ రాపోలు నిరంజన్ బత్తుల అమర్ తాళ్ల సురేష్ ఆంజనేయులు వంగూరు వెంకటేశ్వర్లు బో డిగ వెంకటేష్ కరాటే మాస్టర్ గోపి ప్రసాద్ సంపత్ సైదా వలి ఆది శేఖర్ హరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ రవీంద్ర భారతి జెడ్పి బాయ్స్ హై స్కూల్ జెడ్పి గర్ల్ హై స్కూల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పి ఈ టీ లు విద్యార్థులు సిబ్బంది క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


