అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్. ఏప్రిల్ 18 : అరకు లోయ పట్టణ శివారు యన్టి ఆర్ గ్రౌండ్ లో చుట్టూ పక్కల పారిశుధ్య లోపం గిరిజనులకు , ఆటు పర్యాటకులకు శాపంగా మారింది. ఇంతా జరుగుతున్నా అదికారులు స్పందించాల్సిన అవసరం ఉంది… వివరాల్లోకి వెళితే పీసా కమిటి ఉప అధ్యక్షులు జగన్నాధ్ కీల్లో మాట్లాడుతు..
పర్యావరణాన్ని నాసనం చేస్తున్న మందుబాబులు అరకువేలి టౌన్ చుట్టుపక్కల అంతా బీర్ బ్రాంది సీసాలు ప్లాస్టిక్ కవర్లతో ఎక్కడ చూసినా అపరిశుభ్రంగా ఉంటుంది పంటపొలాలు ప్రదాన రోడ్లు అనికూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ తాగి పడేసి పర్యావరణం నాశనం చేస్తున్నారు. వీళ్ళను మనుషులనాలా పసువులనా అర్దం కావటం లేదు. ఆని పసువులతో వీళ్ళను పోల్చకూడదు ఎందుకంటే పసువులు పర్యావరణాన్ని నాసనం చేయవు ముఖ్యంగా అరకువేలి టౌన్ కి ఆనుకొని ఉన్న శరభగుడ గ్రామం NTR గ్రౌండ్ చుట్టుపక్కల 24గంటలు కనీస జ్ఞానం లేని ఈ విచిత్ర మనుషులు మందుతాగి చెత్త పడేసి వెళ్తుంటారు. ఇది అరికట్టాలి.
పెదలబుడుగ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ సభలో అరకువేలి టౌన్ షిప్ లో దశలవారీగా ప్లాస్టిక్ నిషేధంపై తీర్మానం చేసి ఉన్నారు. మధ్యం షాపు నడిపే వారికి కూడా ఒక మధ్యం సీసాపై 50/- రూపాయలు అదనంగా డబ్బులు వసూలు చేసి తిరిగి కాలీసీస తీసుకునివస్తే ఆ డబ్బులు తిరిగి ఇస్తేబాగుంటుంది మధ్యం అమ్మే వారు మరియు హోటల్ నడిపేవారు పార్శిల్ ప్లాస్టిక్ కవర్లలో ఇవ్వడం మానేయాలి… ఆని జగన్నాధ్ అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


