ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం

TRINETHRAM NEWS

ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ పట్టణంలోని 24వ వికారాబాద్శివాజీ నగర్ కాలనీ మైసమ్మ గుడి ఆవరణలో గురువారం ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం పలు భజన పాటలు ఆలపించడంతోఆలయప్రాంగణమంతా శివనామ స్మరణలతో మార్మోగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది వరకు భక్తులుపాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీదేవి సదానంద రెడ్డి, ప్రభు నగర్ ఆస్థాన పీఠాధిపతి ఛయన సోమయాజీ, శ్రీశ్రీ బాల మారతాండ మాణిక్య ప్రభు మహారాజ్, కౌన్సిలర్లు స్వాతి, దేవి, పావని, సువర్ణ, బిజెపి జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్ల పల్లి రమేష్ కుమార్, నవీన్ కుమార్, మల్లేష్, అమరేందర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, సేవా మండలి ప్రతినిధులు రాజు, వెంకట్, భోగేష్, సుభాష్ శర్మ, రవి పంతులు, కార్తీక్, విక్రమ్, కాలనీ పెద్దలు సదానంద రెడ్డి, రామ్ రెడ్డి, జగన్నాథ రెడ్డి, సోమ నర్సింలు, సుధాకర్ గౌడ్, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top