IMG 20241128 WA0032
అపోలో ఫార్మసీలో జాబ్ మేళా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్
ఉపాధి కల్పన కేంద్రం వికారాబాద్
అపోలో ఫార్మసీ నందు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని
జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము, ఐటిఐ క్యాంపస్ వికారాబాదు నందు నవంబర్ “29 శుక్రవారం” ఉదయము 10:30 గంటలకు జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అపోలో ఫార్మసీ లో సుమారు 50 పోస్టులు ఉన్నాయని వీటికి అందరు అర్హులని తెలిపారు. ఇట్టి ఉద్యోగానికి పదవ తరగతి, ఇంటర్ డిగ్రీ,బిఫార్మా, డి-ఫార్మ్ ,ఎం -ఫార్మసీ విద్యా అర్హత కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఇట్టి ఉద్యోగాలు వికారాబాద్, మోమిన్ పేట్ లోని ప్రఖ్యాత ప్రైవేటు పరిశ్రమల యజమాన్యము తమ పరిశ్రమలకు అవసరమగు సిబ్బందిని ఈ జాబ్ మేళ ద్వారా ఎంపిక చేసుకుంటారని తెలిపారు. ఇట్టిఅవకాశాన్నినిరుద్యోగయువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఇతర వివరములకు జాబ్ మేళా నిర్వాహకుడు మియా సాబ్ 9676047444 ద్వారా సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
