Cricket Tournament : జెడ్పీటీసీ ఆధ్వర్యంలో సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

TRINETHRAM NEWS
Cricket Tournament Under ZPTC

Cricket Tournament : అనంతగిరి జూన్ 3, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం ఎగువ శోభ పంచాయతీ కమలాపురం జాంగూడలో జెడ్పీటీసీ గంగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్‌ను జనసేన మండల అధ్యక్షుడు చిట్టం మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ యువత శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రోత్సాహం కల్పించడం అభినందనీయమని, క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టోర్నమెంట్ విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top