Road Accident : పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కాచెల్లెళ్లు దుర్మరణం

TRINETHRAM NEWS

Trinethram News : కూతుళ్ళ కడసారి చూపులకు నోచుకోకుండా మలేషియాలో చిక్కుకుపోయిన తండ్రి రెడ్డి నాయక్ .. స్పందించి రెడ్డి నాయక్‌తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్.. స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు.. రెడ్డి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు హాజరైన ఖానాపూర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ జాన్సన్ నాయక్

నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతర్య తండాకు చెందిన బాణావత్ సుగుణ, రెడ్డి నాయక్‌ల కూతురు మంజుల(17), హైదరాబాద్‌లో F-SET ప్రవేశ పరీక్ష రాసేందుకు అక్క అశ్విని(19)తో కలిసి వెళ్ళింది.. పరీక్ష అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న కారు కల్వర్టును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు

వీరి తండ్రి రెడ్డి నాయక్ మూడేళ్ళ క్రితం మలేషియాలో పని చేయడానికి వెళ్ళగా, అక్కడ కంపెనీ మోసం చేయడంతో కూలి పని చేస్తున్నాడు.. కూతుళ్ళ మరణవార్త విన్న రెడ్డి నాయక్ ఇంటికి తిరిగి వచ్చేందుకు ఆర్థిక స్తోమత లేదని విలపించాడు

దీనిపై స్పందించిన కేటీఆర్, రెడ్డి నాయక్‌తో ఫోన్లో మాట్లాడగా కూతుళ్లను కడసారి చూడలేకపోతున్నానని కన్నీళ్ళు పెట్టుకున్నాడు .. దీంతో రెడ్డి నాయక్‌ని ఇంటికి తీసుకొచ్చేందుకు కేటీఆర్ టీం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Road accident while returning

You cannot copy content of this page

Scroll to Top