పాలకొండ – సిరికొండ రహదారి పైన రోడ్ ప్రమాదం

TRINETHRAM NEWS

మన్యం జిల్లా:

పాలకొండ నియోజక వర్గంలో పాలకొండ మండలంలో సిరికొండ గ్రామ సమీపంలోని రహదారి మలుపు వద్ద ఈ రోజు రోడ్ ప్రమాదం జరిగింది.

పాలకొండ నుండి వస్తున్న ఆటో, సీతంపేట నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం పరస్పరం బలంగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఆటో బోల్తా పడగా, బైక్ నడుపుతున్న వ్యక్తి కింద పడి తీవ్ర గాయాలపాలు అయ్యాడు. సమీపంలోని గ్రామస్థులు వెంటనే అంబులెన్స్, పోలీస్ వారికి కాల్ చేసి సమాచారం అందించారు.

You cannot copy content of this page

Scroll to Top