Road accident : రోడ్డు ప్రమాదం: చెట్టును ఢీకొన్న కారు

TRINETHRAM NEWS
Road accident: Car hits tree

Road accident : త్రినేత్రం న్యూస్ : హనుమకొండ, ఏప్రిల్ 02, 2026: తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు.

మృతులను జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల శివ, లోకేష్‌లుగా గుర్తించారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కావడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top