జూన్ 26, 2026

cr 20241118tn673b0c859f735

TRINETHRAM NEWS

దొంగ కేసులు పెడితే ఊరుకోం.. మహిళలపై నీచమైన పోస్టులు పెడుతున్నారు: ఆర్కే రోజా

డైవర్షన్ పాలిటిక్స్ తో కూటమి ప్రభుత్వం నెట్టుకొస్తోందన్న రోజా

వ్యక్తిత్వ హననం చంద్రబాబుకు అలవాటేనని విమర్శ

సీఎంగా ఉన్నప్పుడే జగన్ పై నీచమైన పోస్టులు పెట్టారని మండిపాటు

Trinethram News : Andhra Pradesh : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక… డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. వైసీపీకి చెందిన మహిళలపై నీచంగా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీపై, వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన కూటమి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి ఈస్ట్ పీఎస్ లో రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రోజా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తప్పు చేస్తే వైసీపీ కార్యర్తలపై కేసులు పెట్టాలని… దొంగ కేసులు పెడితే తాము ఊరుకునేది లేదని రోజా అన్నారు. టోపీపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చేసేలా ప్రవర్తించాలని పోలీసులకు హితవు పలికారు. ఎదుటి వారిపై బురద చల్లడం, వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు.

జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఆయనపై నీచమైన పోస్టులు పెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఆపడానికి పోలీసులను వాడాలని… అలా కాకుండా వైసీపీ శ్రేణులను అణచివేయడానికి వాడితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page