Approved Seven Bills : ఏడు బిల్లులకు ఆమోదముద్ర వేసిన ఏపీ అసెంబ్లీ

TRINETHRAM NEWS

ఏడు బిల్లులకు ఆమోదముద్ర వేసిన ఏపీ అసెంబ్లీ

ఏపీ మున్సిపల్ సవరణ బిల్లుకు ఆమోదం

పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం

ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లుకు ఆమోదం

Trinethram News : Andhra Pradesh : ఏడు కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు – 2024, ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు – 2024, హెల్త్ యూనివర్శిటీ సవరణ బిల్లు – 2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు – 2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు – 2024లను అసెంబ్లీ ఆమోదించింది.

ఏపీ సహకార సంఘం సవరణ బిల్లు – 2024, ఎంత మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకొచ్చిన బిల్లులకు ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు రేపటికి వాయిదా వేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top