Calendar Launch : సమాచార హక్కు చట్టం రక్షణ సమితి క్యాలెండర్ఆవిష్కరణ

TRINETHRAM NEWS

ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ దేశాల భూపాల్.

దేవరకొండ డివిజన్ జనవరి 08 త్రినేత్రం న్యూస్. భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడం ఒక మైలురాయి అని ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ దేశాల భూపాల్ అన్నారు. హైదరాబాద్ లోని సమాచార హక్కు భవన్ లో గురువారం నాడు సమాచార హక్కు చట్టం రక్షణ సమితి నూతన సంవత్సర-2026 క్యాలెండర్ ను ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ దేశాల భూపాల్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం-2005 పారదర్శకత జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం అవినీతిని అరికట్టడం, పౌరులకు సాధికారత కల్పించడం లో దోహదపడుతుందని ఆయన అన్నారు.ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేయడం కోసం బలమైన చట్టపరమైన చర్యలు పౌరులు తమ హక్కులను వినియోగించుకోవడానికి అనువైన చట్టమే సమాచార హక్కు చట్టం-2005 అని ఆర్టీఐ కమిషనర్ అన్నారు.
ప్రభుత్వ అధికారులను జవాబుదారీగా ఉంచడానికి ఇది శక్తివంతమైన సాధనం లా ఉంటుందనివారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలోవారితోపాటు రాష్ట్ర అధ్యక్షులు డా,, కొర్ర కిషన్ నాయక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజీమ్ రాష్ట్ర కార్యదర్శి పగిడిమర్రి యాదగిరి రాష్ట్ర ప్రచార కార్యదర్శి డా,,ఎండీ జిలానీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Right to Information Act Protection Committee Calendar Launch

You cannot copy content of this page

Scroll to Top