
రాష్ట్రంలో అన్ని జిల్లాల లో ఆర్ టీ ఐ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలి.
ఆర్టీఐఏఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా,, కొర్ర. కిషన్ నాయక్
Right to Information Act : దేవరకొండ డివిజన్ జూన్ 06, త్రినేత్రం న్యూస్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్టివిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం-2005 బలోపేతం కొరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా,, కొర్ర. కిషన్ నాయక్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం జిల్లా మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో (గ్రామపంచాయతీ స్థాయి రాష్ట్ర స్థాయి వరకు) సమాచార బోర్డులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం స్వచ్ఛందంగా వెల్లడించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, సెక్షన్ 26 అనేది చాలా కీలకమైనది.ఇది ప్రజలకు సమాచార హక్కుపై అవగాహన కల్పించడానికి మరియు ఈ చట్టాన్ని సమర్థవంతగా అమలు చేయడానికి ప్రభుత్వాలు చేపట్టావాల్సిన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం దరఖాస్తుదారులు, కార్యకర్తల రక్షణకు సంబంధించిన మెమో నం. 33086ను సమర్థవంతంగా అమలు చేయాలని విన్నవించారు. దరఖాస్తుదారుల వివరాలు బహిర్గతం కాకుండా చూడాలని, వారికి చట్టప్రకారం గడువులోపు సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించే ఆర్‌టిఐ కార్యక్రమాల్లో సొసైటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో నిరంతరం ఆర్‌టిఐ చట్టం అమలుకు కృషి చేస్తుందని తెలిపారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు సమాచార హక్కు చట్టంపై, భారత రాజ్యాంగ పీఠిక, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నివారణ, రోడ్ సేఫ్టీ, ప్లాస్టిక్ నివారణ పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ పై అవగాహన కార్యక్రమాలు , చేపడుతున్నట్లుగా సంక్షిప్తంగా చెప్పాలంటే సెక్షన్ 26 అనేది RTI(ఆర్టీఐ), చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడానికి ప్రభుత్వానికి అప్పగించిన ఒక్క బాధ్యత అని కిషన్ నాయక్ చేపిన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe