
Arrangements NEET Re-examination : వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుండి నీట్ పునః పరీక్ష, యోగా దినోత్సవం, వరి ధాన్యం సేకరణ, మహిళా సమాఖ్యల ద్వారా కొనుగోలు చేసిన బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభోత్సవం, పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ , ఆసుపత్రుల అభివృద్ధి సొసైటీ సమావేశాలు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతూ… జూన్ 21న నిర్వహించే పరీక్షను ఏంటిఎ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలన్నారు.
అందుకు అనుగుణంగా జిల్లాలోని (5) పరీక్షల కేంద్రాల్లో అన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.
రుతుపవనాల ప్రభావంతో వర్షాలు రావడం వల్ల వరి ధాన్యం తడిసే ప్రమాదం ఉందని, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకొని వరి ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు, గోదాములకు చేరవేయాలని ఆయన పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు. అవసరాలను బట్టి ట్రాన్స్ పోర్ట్ లారీల సంఖ్యను పెంచుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మొత్తం 19 మండల మహిళా సమాఖ్యల ద్వారా 19 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల మహిళా సమాఖ్యలు స్థిరమైన ఆదాయం పొందుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని ఆయన తెలిపారు.
జనవరి 9న పరేడ్ గ్రౌండ్ లో జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమంలో భాగంగా అద్దె బస్సులనుప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరయ్యే మహిళా సమాఖ్య సభ్యులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, త్రాగునీరు సదుపాయంతో పాటు ఆశా వర్కర్ ప్రతి బస్సులో ఉండే విధంగా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు.కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలుఉమా శంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ రెవెన్యూ కే వెంకటాచారి, డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, జిల్లా విద్యాధికారి మహమ్మద్ అబ్దుల్ ఘని, నీట్ సిటీ కోఆర్డినేటర్ కే.సాయి లత, చీఫ్ సూపరింటెండెంట్ డి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe