యాజమాన్యం ప్రభుత్వం మారుపేర్ల సమస్యను పరిష్కరించి కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
ఐ కృష్ణ. ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు
గోదావరిఖని మే-23:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈ ధర్నా నుద్దేశించి ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ సింగరేణి సంస్థ లో గత 30 సంవత్సరాలుగా సర్వీస్ పూర్తి చేసి అనారోగ్య కారణాల వలన కార్పొరేట్ మెడికల్ బోర్డు వారిచే మెడికల్ ఇన్వాలిడెట్ ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకుంటే విజిలెన్స్ అధికారులు మారుపేర్ల పై ఉద్యోగం చేసిన వారిని రెండు పేర్లు ఉన్నాయని కారణంతో దరఖాస్తు చేసుకున్న డిపెండెంట్ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా గత 15 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. సకాలంలో సింగరేణి ఉద్యోగం రాక ఎలాంటి ఉపాధి మార్గం లేక కార్మికుల పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని వారి కుటుంబాల పోషణకు భారంగా మారిందన్నారు. గతంలో మారుపేరుల సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు ఈనాటికీ మారుపేరుల సమస్యను పరిష్కరించలేదన్నారు.
ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం మారుపేర్ల సమస్యను పరిష్కరించి విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో గ్లాబిక్స్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్, బి అశోక్,మారుపేర్ల బాధిత సంఘం నాయకులు శ్రావణ్, శ్రీనివాస్, రామిల్ల సందీప్, కొమరమ్మ, వెంకటేష్, రాజు, రామగుండం రీజియన్ కార్యదర్శి ఈ రామకృష్ణ నాయకులు జి మల్లేశం చింతల శేఖర్, ఎస్ ప్రసాద్, ఏ చంద్రయ్య, ఎం కొమరయ్య ,ఎడ్ల రవికుమార్, సదానందం లతో పాటు 30 మంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


