AITUC : గని ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల వారసులకు గ్రేడ్ త్రీ క్లర్కులు గా ఇచ్చేందుకు అంగీకారం

TRINETHRAM NEWS

డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో ఒప్పందం పై యాజమాన్యం, గుర్తింపు సంఘం ఏఐటియుసి ప్రతినిధుల సంతకాలు.

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి లో గని ప్రమాదంలో మరణించిన కార్మికుల పిల్లలకు గ్రేడ్ త్రీ క్లర్క్ లు గా నియమించేందుకు యాజమాన్యం అంగీకరించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ లోని రీజినల్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యం తో గుర్తింపు సంఘం ఏఐటియుసి జరిగిన ఒప్పందం పై సంతకాలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో మైన్ యాక్సిడెంట్లో చనిపోయిన ఉద్యోగుల డిపెండెంట్ లకు 2009 అగ్రిమెంట్ ప్రకారం నాడు గుర్తింపు సంఘం గా ఉన్న ఏఐటియుసి ఒప్పందం మేరకు సంస్థలో ఉన్న టెక్నికల్ అర్హత కలిగిన డిపెండెంట్ లకు మాత్రమే సూటబుల్ ఎంప్లాయిమెంట్ అనగా సూపర్వైజర్సు గా, టెక్నీషియన్స్ గా అవకాశం కల్పించబడిందని, కానీ నాన్ టెక్నికల్ డిగ్రీ కలిగి ఏదేని ఉద్యోగి ప్రమాదంలో చనిపోతే వారి డిపెండెంట్ లకి అండర్ గ్రౌండ్ జనరల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇస్తున్నారని, ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రమాదాలు జరిగి చాలామంది ఉద్యోగులు చనిపోయారని, వారి పిల్లలకు కూడా సూటబుల్ ఉద్యోగాన్ని యాజమాన్యం కల్పించలేదని,

అందువల్ల గుర్తింపు సంఘం గా ఎన్నికైన తర్వాత వీరి సమస్యను దృష్టిలో పెట్టుకొని స్ట్రక్చరల్ కమిటీలో ఈ డిమాండ్ ని చేర్చి యాజమాన్యంతో అగ్రిమెంట్ చేయించడం జరిగిందని ఆయన అన్నారు. ఇది చట్టబద్ధంగా ఉండాలని పారిశ్రామిక వివాదాల చట్టం 12 (3) ప్రకారం త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం గురువారం హైదరాబాదులో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యం మరియు గుర్తింపు సంఘం నాయకుల మధ్యన అధికారిక వ్రాతపూర్వక ఒప్పందం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఎవరైనా ఉద్యోగి ఈ మధ్యకాలంలో మైన్ యాక్సిడెంట్కు గురై చనిపోయిన వారి వారసులకు జనరల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లయితే వారందరూ కూడా ఈ ఒప్పందం ప్రకారం సూటబుల్ ఎంప్లాయ్మెంట్ నాన్ టెక్నికల్ వారందరికీ గ్రేడ్ 3 క్లర్క్ (మినిస్ట్రియల్ స్టాఫ్) ఉద్యోగము కల్పించబడుతుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి లో అర్హులు ఎవరైనా ఉన్నచో ఇట్టి ఒప్పందం ప్రకారం సర్కులర్ జారీ కాగానే దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన తెలిపారు. అదె విధంగా
సింగరేణి ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉన్న ప్రతి డిమాండ్ ను ఇప్పటికే స్ట్రక్చరల్ కమిటీలలో పెట్టి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి చర్చించి అన్ని డిమాండ్లను పరిష్కరించుటకు గుర్తింపు సంఘం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే కొన్ని ఒప్పందాలను అమలు చేస్తూ సర్క్యులర్ లను యాజమాన్యం జారీ చేసిందని ఆయన అన్నారు. ఇంకా కొన్ని సర్క్యులర్ లు రావాల్సి ఉన్నాయని, కొన్ని డిమాండ్ల పై కమిటీలు వేసి కమిటీ రిపోర్ట్ ప్రకారం అమలు చేయుటకు యాజమాన్యం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కనుక గని కార్మికులు ఇట్టి విషయాలను దృష్టిలో ఉంచుకొని గుర్తింపు సంఘంపై విశ్వాసముంచాలని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో యాజమాన్య ప్రతినిధుల తో పాటు ఏఐటియుసి అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, మడ్డి ఎల్లా గౌడ్, కందికట్ల వీర భద్రం, ముస్కే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

employees who died in the mine accident

You cannot copy content of this page

Scroll to Top