Review : రివ్యూ: భైరవం.. ముగ్గురు హీరోల యాక్షన్‌ డ్రామా ఎలా ఉంది?

TRINETHRAM NEWS

Trinethram News : ఈ రోజు విడుదలైన మూవీ బాక్సాఫీస్ ముందుకు వ‌చ్చిన చెప్పుకోద‌గ్గ చిత్రం ‘భైర‌వం’. ముగ్గురు క‌థానాయ‌కులు క‌లిసి న‌టించడం ఈ సినిమా ప్ర‌త్యేక‌త‌. ప్ర‌చార కార్య‌క్ర‌మాలు కూడా అందుకు త‌గ్గ‌ట్టుగా సంద‌డిగా సాగాయి.
చిత్రం: భైరవం; నటీనటులు: బెల్లకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్‌, నారా రోహిత్‌, అదితి శంకర్‌, ఆనంది, దివ్య పిళ్లై, శ‌ర‌త్ లోహితాశ్వ‌, జయసుధ, అజయ్‌ తదితరులు; సంగీతం: శ్రీచరణ్ పాకాల; ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్‌; సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం; నిర్మాత: కె.కె.రాధామోహన్‌; రచన: ఆర్‌ఎస్‌ దురై సెంథిల్‌కుమార్‌; దర్శకత్వం: విజయ్‌ కనకమేడల; విడుదల: 30-05-2025
నిజాయ‌తీ, పెద్దరికం నింపుకొన్న వ‌ర‌ద పాత్ర‌లో నారా రోహిత్ ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేస్తారు. మంచు మ‌నోజ్ రీ ఎంట్రీకి త‌గ్గ ఓ శ‌క్తిమంత‌మైన పాత్ర ఇందులో దొరికింది. ఆయ‌న కొన్ని చోట్ల బిగ్గ‌ర‌గా సంభాష‌ణ‌లు చెప్పిన‌ట్టు అనిపించినా, వ్య‌తిరేక ఛాయ‌లున్న గ‌జ‌ప‌తి వ‌ర్మ పాత్ర‌పై త‌న‌దైన ముద్ర వేశారు. నారా రోహిత్‌కి జోడీగా న‌టించిన దివ్య పిళ్లై, మంచు మ‌నోజ్‌కి జోడీగా న‌టించిన ఆనంది పాత్ర‌లూ సినిమాలో కీల‌క‌మే. వెన్నెల కిశోర్ ఒక‌ట్రెండు స‌న్నివేశాల్లో క‌నిపించి న‌వ్విస్తాడు. అజ‌య్, శ‌ర‌త్ లోహితాశ్వ‌, సంప‌త్ రాజ్‌, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు అల‌వాటైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు.

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. నేప‌థ్య సంగీతం మెప్పిస్తుంది. హ‌రి కె.వేదాంతం విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటాయి. (bhairavam director) ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల పాత ప‌ద్ధ‌తుల్లోనే క‌థ చెప్పారు త‌ప్ప‌, త‌న ప్ర‌త్యేక‌తేమీ చూపించ‌లేదు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

బ‌లాలు

  • ముగ్గురు క‌థానాయ‌కులు
  • ద్వితీయార్ధం
  • యాక్ష‌న్ స‌న్నివేశాలు
    బ‌ల‌హీన‌త‌లు
  • కొర‌వ‌డిన భావోద్వేగాలు
    చివ‌రిగా: భైర‌వం… ముగ్గురు హీరోల‌ యాక్ష‌న్ హంగామా (Bhairavam Review)8.7/10
    గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Review: Bhairavam.. How is

You cannot copy content of this page

Scroll to Top