జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 07 at 16.13.31

TRINETHRAM NEWS

Kalki is shaking the box office with a tsunami of collections

Trinethram News : పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్ కాంబోలో వచ్చిన మూవీ కల్కి 2898 ఏడీ.
దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన తగ్గేదేలేదంటూ ఈ మూవీ మానియా కొనసాగుతోంది. అంతేకాదు పాన్ఇండియా రేంజ్‌లో దుమ్ములేపుతోంది. ఇక కలెక్షన్లలోనూ తన సునామీని కంటిన్యూ చేస్తూ అంతకుమించి అన్నట్టుగా నడుస్తోంది. ఈ మూవీ రిలీజైన నాటి నుండి కలెక్షన్ల సునామీని రాబడుతోంది. కేవలం నాలుగైదు రోజుల్లోనే దాదాపు రూ.600 కోట్ల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

తాజాగా ఈ మూవీ రూ. 800 కోట్ల క్లబ్‌ గ్రాస్‌లోకి చేరి, దట్ ఈజ్ కల్కి అంటూ తన వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తోంది. ఇక ఇదే విషయమై ఆ మూవీ యూనిట్ రియాక్ట్ అయ్యింది. తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది ఈ మూవీ టీమ్‌. బాక్సాఫీస్ ఆన్‌ ఫైర్ అనే క్యాప్షన్ ఇచ్చి రూ. 800 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలిపారు.

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రూ. 800 కోట్లు రాబట్టిన సినిమాల క్లబ్‌లోకి చేరిన మూడో మూవీగా నిలిచింది. అంతేకాకుండా ప్రభాస్ తన మానియాని కొనసాగిస్తూ, అంతకుమించి అన్నట్లుగా నడుస్తోంది. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా తన దూకుడుని పెంచి ఆడియెన్స్‌కి దగ్గరైంది. ఇక బుజ్జి హైలైట్‌గా నిలిచి అందరినోట కల్కి మాటనే వినిపిస్తోంది.

ఈ ఏడాదిలో రిలీజైన మూవీస్‌లో తన మార్క్‌ని కొనసాగిస్తూ తన మార్క్‌ని కంటిన్యూ చేస్తోంది. ఇక గతంలోనూ డార్లింగ్ బాహుబలి చిత్రాలతో దుమ్ములేపి తన మూవీస్‌ని తానే బ్రేక్ చేశాడు. ఏకంగా రూ. 800 కోట్ల క్లబ్‌లోనూ చేరి తనకంటూ ఓ ఫ్యాన్స్‌ ఉన్నారని ప్రూవ్ చేసుకుంది కల్కి. తన దారి రహాదారి అంటూ బ్రేకుల్లేకుండా జెట్‌ స్పీడ్ దిశగా కొనసాగుతోంది. అందులోనూ టాలీవుడ్‌ నుంచి రిలీజైన కల్కి మూవీతో మరోసారి దేశమంతా టాలీవుడ్ వైపు చూసేలా చేసి శభాష్ కల్కి అనిపించుకుంటోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kalki is shaking the box office with a tsunami of collections

You cannot copy content of this page