Dodla Venkatesh Goud : దోమల నివారణ పట్ల అవగాహన ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 30 : వర్షాకాలం నేపథ్యంలో జి.ఎచ్.ఎం.సి కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశాలమేరకు, పైలెట్ ప్రోగ్రాంలో భాగంగా కూకట్పల్లి సర్కిల్లో ఉన్న మూడు ఏ ఎల్ ఓ యూనిట్ల సిబ్బందితో కలిసి 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన వచ్చేందుకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొని, ఎంటమాలజీ ఎ.ఇ తేజశ్రీ మరియు సిబ్బందితో కలిసి ప్లకార్డులు పట్టుకుని పాదయాత్ర చేస్తూ పర్యటించి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గుంతలలో మరియు డ్రమ్ములలో నిల్వఉన్న నీటిలో దోమల మందు పిచికారీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతు నిల్వ ఉన్న నీటిలోనే లార్వా పెరిగి దోమల వ్యాప్తి జరిగి, విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మన ఇంటి పరిసరాలలో అనగా గుంతలు, కూలర్స్, పూల కుండీలు, డ్రమ్ములు, టైర్లు, పగిలిపోయిన ప్లాస్టిక్ బకెట్లు, మట్టి కుండలు, బిల్డింగ్ పైన ఉండే సింటెక్స్లు, సిమెంటు గోళాలు మొదలగు వాటిలో నిల్వఉన్న నీటిని వారానికి ఒకసారైనా తొలగించాలని అన్నారు. దోమలు గుడ్లు పెట్టి గుడ్డు నుండి దోమగా రూపాంతరం చెందడానికి వారం రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఈ వారం రోజుల లోపల ఆ దోమ యొక్క కాలా చక్రాన్ని మనం బ్రేక్ చేసి, దోమల ఉత్పత్తిని అరికట్టవచ్చు కాబట్టి ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ నీటి నిల్వలను తొలగించాలని అన్నారు.

అదేవిధంగా ప్రతి ఇంటికి వెళ్లి నీటి నిల్వలను తనిఖీ చేసే ఎంటమాలజీ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కార్పొరేటర్ తెలియజేశారు. దోమ కాటు ద్వారా మనకి డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరం, చికెన్ గున్యా, మెదడువాపు, బోదకాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ మీ కాలనీకి వచ్చే ఎంటమాలజీ సిబ్బందికి సహకరించి వారిచ్చే సూచనలు పాటించాలి అని కార్పొరేటర్ తెలియజేశారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, జి.రవి, భాస్కర్, యాదగిరి, రాజుగౌడ్, ఎంటమాలజి సూపర్వైజర్లు డి.నరసింహులు మరియు నరేష్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Corporator Dodla Venkatesh Goud

You cannot copy content of this page

Scroll to Top