బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్.
దేవరకొండ డివిజన్ జనవరి 21 త్రినేత్రం న్యూస్. బి ఆర్ ఎస్ పార్టీ జెండా దిమ్మేలను కూల్చాలంటూ పిలుపునివ్వడం సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరికి నిదర్శనం అని బీ ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు , మాజి శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన పార్టీ బి ఆర్ ఎస్ అని అన్నారు. బీ ఆర్ ఎస్ ను మాజి సీ ఎం కే సి ఆర్ ఆనవాళ్లను చెరపడం ఎవరి తరమూ కాదని అన్నారు. రేవంత్ రెడ్డి రోజురోజుకు దిగజారి మాట్లాడటం, సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సరికాదన్నారు.
ఎవరి దిమ్మలు విరగొట్టాలో ఎవరిని ఇంటికి పంపాలో రాష్ట్ర ప్రజలకు తెలుసని, అన్నారు .రేవంత్ రెడ్డి భాషను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు అని అన్నారు. బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కుల్చివేయాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


