ఒక సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన మహాత్మా జ్యోతిరావ్ పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని రేవంత్ రెడ్డి కొనియాడారు

TRINETHRAM NEWS

ఒక సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన మహాత్మా జ్యోతిరావ్ పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని రేవంత్ రెడ్డి కొనియాడారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. జ్యోతిభా పూలే జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు పూలే ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిభా పూలే పేరు పెట్టి ప్రజా భవన్‌గా మార్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

You cannot copy content of this page

Scroll to Top